![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -354 లో.. ఆడపిల్లని ఎలా పెంచాలో చేతకాని వాళ్లు అంటున్నారు మీ వాళ్ళు.. అదే మాట నేను మీ వాళ్ళని మీకు ఆడపిల్లని పెంచడం చేతకాదు.. అందుకే మీ కూతురు ఎవడితోనో లేచిపోయింది అని నేనంటే మీ వాళ్ళ పరిస్థితి ఏంటని ధీరజ్ అనగానే ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతుంది.
ఇక ఇంట్లో అంత జరిగాక అందరు బాధతో ఉంటారు. శ్రీవల్లి మాత్రం ఎవరికి తగ్గట్టు వాళ్ళకి పాటలు సెట్ చేస్తూ వింటూ ఎంజాయ్ చేస్తుంది. డాన్స్ చేస్తుంది. ప్రేమ ఏడుస్తుంటే నర్మద బయటకు చాప దిండు తీసుకొని వచ్చి పడుకోమని చెప్పి తన పక్కనే నర్మద కూడా పడుకుంటుంది.
మరుసటి రోజు శ్రీవల్లి ఉదయం నిద్రలేచి పూజ చేస్తుంది. బయటకు వచ్చేసరికి ప్రేమ, నర్మద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతుంటే శ్రీవల్లి చూసి షాక్ అవుతుంది. వీళ్ళేంటి మళ్ళీ కలిసిపోయారా అనుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్లి ఇప్పుడే కదా పూజ చేసాను.. మళ్ళీ వాళ్ళు కలిసిపోయారు ఏంటని దేవుడిపై కోప్పడుతుంది.
విశ్వ నీకు కావాలనే అబద్ధం చెప్పాడని అనిపిస్తుంది ప్రేమ అని నర్మద అనగానే.. లేదు మా అన్నయ్యలో ఆ విషయంలో నిజాయతి కన్పించిందని ప్రేమ అంటుంది. అదంతా అబద్ధం అని నిరూపిస్తే అని నర్మద అనగానే.. వద్దు అక్క ఇక్కడితో వదిలేయ్ అని ప్రేమ కోపంగా లోపలికి వెళ్తుంది.
అదంతా శ్రీవల్లి చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్లి సారీ దేవుడా నేను కోప్పడ్డది మనసులో పెట్టుకోకు వాళ్ళు కలిసిపోలేదని శ్రీవల్లి అంటుంది.
ఆ తర్వాత ఇంట్లో అందరిని పిలవమని వేదవతికి రామరాజు చెప్తాడు. వేదవతి పిలవగానే ఇంట్లో అందరు వచ్చేస్తారు. నేను అమూల్యకి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నానని రామరాజు అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |